నేల ఉసిరిలో అనేక ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. నరాల సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు దరిచేరవు. కామెర్ల వ్యాధి చికిత్సకు నేల ఉసిరిని ఉపయోగిస్తారు.