KMM: బోనకల్లు మండలం కలకోట గ్రామపంచాయతీ పరిధిలోని రాళ్లవాగు ప్రక్కన ఉన్నటువంటి మిషన్ భగీరథ పైపులు లీకై గత కొన్ని రోజులుగా ఆ లైన్ ద్వారా వెళ్లే గ్రామాలకు నీటి సరఫరా సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే దీనిపై RWS DEE స్పందించి పైపులు మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్లు సరఫరా వెంటనే ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.