KMM: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మధిర మున్సిపాలిటీకి సంబంధించిన 22 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను గురువారం మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయంలో ప్రజలకు పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ వివరించారు.