TG: శాసనసభలో ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నదీజలాలపై అవగాహన లేని సీఎం తమకు ఉపన్యాసాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. చెక్‌డ్యాంలు ఎలా విఫలం చేయాలో, మేడిగడ్డ, సుంకిశాల, వట్టెం పంప్ హౌస్ ఘటనలను వివరించబోతున్నారా? అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు.