TG: తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాతో పాటు 15 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన దేవా.. గతంలో హిడ్మాతో కలిసి పనిచేసినట్టు చెబుతున్నారు. బర్సె దేవాపై రూ.50లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది.