KRNL: ఆలూరులో ఆదోని జిల్లాగా ప్రకటించాలని గురువారం డిమాండ్ చేస్తూ.. సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో బస్టాండ్ వద్ద 21వ రోజు జేఏసీ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు, సీపీఐ, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ డిమాండ్ వినిపించాలని కోరారు.