AKP: పాయకరావుపేట మండలం పాల్తేరులో గ్రామంలో ఫ్లెక్సీ వివాదం రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన వారు బుధవారం అర్ధరాత్రి పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు. గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పికెట్ ఏర్పాటు చేశారు.