MBNR: రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. పురుషులు, మహిళా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు.