KMM: సాగు చేసే రైతులకు సరిపడా యూరియా స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందని కలెక్టర్ అనుదీప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 13,453 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు రైతులకు 22,472 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు కలెక్టర్ చెప్పారు. యూరియా పంపిణీ సంబంధిత అంశాలలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.