స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ సందర్భంగా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట రికార్డులు సృష్టిస్తోంది. తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ షేర్ చేసిన కేవలం 4 గంటల్లోనే 6.2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది. ప్రస్తుతం, ఇన్స్టాలో 274 మిలియన్ల ఫాలోవర్లతో కోహ్లీ భారత్లోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.