MNCL: గ్రామాల సమస్యలు పరిష్కరిస్తానని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. గ్రామాలలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే రూ. 10 లక్షలతో అభివృద్ధి పనులు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గురువారం లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో రెండు బోర్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురిమల్ల సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.