నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె. జాన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్. వాణి హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆర్ఎం పేర్కొన్నారు.