WGL: కొత్త ఏడాదిలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూసి ప్రభుత్వ విభాగాలను అక్కడికి తరలిస్తామని అన్నారు. ముఖ్యంగా 24 అంతస్తులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తయ్యేలా చూసి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.