ATP: జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి అనంతపురంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.