NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించినట్లు డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. ఎస్సై నారాయణరెడ్డి హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అందరి సహకారంతోనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు ఉన్నారు.