AP: సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలంలోని తూముకుంట SBI బ్యాంకులో చోరీ జరిగింది. దీనికి సంబంధించి రూ.5.5 కోట్ల విలువ చేసే 3.5 కిలోల బంగారాన్ని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇసార్ఖాన్ కుమార్ సాయంతో హర్యానాకు చెందిన అనిల్ ఫర్వార్ ఈ దోపిడీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.