SRD: మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లి తండాలో వెలిసిన మోతీ మాత అమ్మవారి జాతర ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ ఉత్సవ జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కులమతాలకతీతంగా ప్రజలు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు.