పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఓ రైతు పత్తిని అమ్మేందుకు ట్రాక్టర్లో లోడ్ చేసుకుని ఆసిఫాబాద్ జిన్నింగ్ మిల్లుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.