ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సోయాబీన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును MLA పాయల్ శంకర్, రామారావు పటేల్ కోరారు. సోయాబీన్ పంట పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు MLA శంకర్ పేర్కొన్నారు.