ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేద పండితులు వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.