ATP: నూతన సంవత్సర సందర్భంగా శింగనమల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, ధైర్యంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రజలందరి కలలు సాకారం కావాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.