E.G: చాగల్లు మండలంలో బుధవారం 92.79 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు. మొత్తం 9155 మంది లబ్ధిదారులకు గాను 8642 మందికి నగదు అందజేశారు. కలవలపల్లిలో అత్యధికంగా 96.26 శాతం, చంద్రవరంలో అత్యల్పంగా 88.95 శాతం పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.