KRNL: మంత్రాలయం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ‘ఉత్తమ వృత్తి సేవా పథకం’ అవార్డు బుధవారం లభించింది. రికార్డుల నవీకరణ, 34 మోటార్ సైకిళ్ల రికవరీ కేసుల్లో చూపిన ప్రతిభకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా సీఐ రామానుజులు, ఎస్సై మల్లికార్జున ఆయనను అభినందించారు.