NLR: పామూరు – తిమ్మారెడ్డిపల్లి మార్గంలో జాతీయ రహదారిపై బుధవారం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు, వాహనదారులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు బాగా దెబ్బతిందని స్థానికులు పేర్కొన్నారు.