VSP: జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు.