BDK: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన, వృథా ఖర్చులకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని అందజేయాలని కోరారు.