ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపవద్దని SP సూచించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DSP జీవన్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.