AP: ప్రముఖ సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం నెలకొంది. అనంతపురం హార్మొనీ సిటీలో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.