KDP: సిద్ధవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట మలినేని పట్నం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తికి బలమైన గాయాలు కాగా.. మెరుగైన వైద్య సేవల కోసం 108లో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి స్థానిక మండల పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.