AP: తెలంగాణ మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకానికి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన వస్తువుల విభజన కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీలతో ఈ కమిటీ సమావేశం కానుంది.