KMR: భిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన స్వామి (56) మృతి చెందినట్లు సర్పంచ్ పద్మ, స్వామి తెలిపారు. జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించినట్లు సర్పంచ్ చెప్పారు.