కృష్ణా: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాము ఈరోజు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యంగా ఉంటే ఎంత అభివృద్ధి సాధించుకోవచ్చో గడిచిన ఏడాదిలో గుడివాడ ప్రజలు చూపించారన్నారు. ప్రజల్లో వచ్చిన మార్పు చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్లలో ఏర్పడిన సమస్యలను కూటమి ప్రభుత్వ ఐదేళ్లలో పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.