ATP: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆనంద్ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రేపు ఉ.10 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థుల కోసం పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరారు.