HYD: ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారాలకు అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.