AP: తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఘోరం జరిగింది. పాపన హరిప్రసాద్, లక్ష్మీమౌనిక అనే దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. భార్యాపిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్ ఇవాళ అత్తింటికి వెళ్లగా, అతనిపై మామ దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో బాధితుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.