KMM: తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సంయుక్తగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో యూరియా కోసం వేలాది మంది రైతులు మన గ్రో మోర్ సెంటర్స్, సోసైటి కార్యాలయాలు వద్ద క్యూ లైన్లు నిలబడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించేందుకు గ్రామాల వారిగా సరఫరా చేయాలని కోరారు.