ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనను కలవడానికి వచ్చిన సందర్శకులకు ‘కం విత్ బుక్’ అనే నినాదంతో ఒక వినూత్నమైన సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలని ఆయన సూచించారు.