BHPL: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు బొకేలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పేద విద్యార్థులకు నోట్బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష ప్యాడ్స్ అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బొకేలు ఆనవాయితీ అయినప్పటికీ, విద్యా సామగ్రి అందించడం విద్యార్థులకు మరింత ఉపయోగకరమని స్పష్టం చేశారు.