2026 నుంచి ద్విచక్ర వాహనదారుల కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకోస్తోంది. జనవరి 1నుంచి తీసుకునే బైకులకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటివరకు 150cc కంటే ఎక్కువ పవర్ ఉన్న బైక్‌లకే ABS ఉండేది, కానీ ఇకపై చిన్న స్కూటర్ల నుంచి పెద్ద బైక్‌ల వరకు అన్నింటికీ ABS ఉండాల్సిందే. దీనితో పాటు, కొత్త వాహనం కొన్నప్పుడు రెండు హెల్మెట్లు ఫ్రీగా ఇస్తారు.