AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రేపు తాడిపత్రిలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. తాడిపత్రి ప్రజల మార్పు కోసం ఒకరోజు దీక్ష చేయబోతున్నట్లు తెలిపారు. తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీక్ష చేయనున్నట్లు చెప్పారు. 2026లో తాడిపత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.