VZM: జిల్లాలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. జనవరి 2 నుంచి 9 వరుకు ముందుగా నిర్ణయించిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు.