కృష్ణా: మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనం పనులను పరిశీలించారు. గ్రామంలో దాతల విరాళాలు రూ.50 లక్షలతో నిర్మిస్తున్న జడ్పీ హైస్కూల్ పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లికార్జునరావు, సర్పంచ్ రాంబాబు పాల్గొన్నారు.