NLR: 2026 నూతన సంవత్సరంలో ప్రజలందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ది చెందాలని, భోగభాగ్యాలు, శుభాలు, సంతోషాలు, ఆనందాలు నింపే సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.