గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో డెలివరీ ఏజెంట్లకు స్విగ్గీ, జొమాటో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ఇవాళ 6PM నుంచి 12AM మధ్య పనిచేసే వర్కర్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120-150 చెల్లించనున్నాయి. ఆర్డర్‌ను బట్టి ఒక్కొక్కరూ సగటున రూ.3వేలు ఆర్జించొచ్చని తెలిపాయి. క్యాన్సిలేషన్లు, ఆర్డర్ తీసుకోకపోవడం వంటి వాటిపై పెనాల్టీలు ఉండవని స్పష్టం చేశాయి.