TG: హైదరాబాద్ నంది నగర్ నుంచి బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లికి చేరుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే 2వ తేదీన తిరిగి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారో? లేదో? చూడాలి మరి.