WNP: నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దమందడి ఎస్సై యుగంధర్ రెడ్డి సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డీజేల వినియోగంపై నిషేధం ఉన్నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.