మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, కోరం కనకయ్య హాజరై పార్టీ కార్యకలాపాలను సమీక్షించారు. సమావేశంలో భవిష్యత్తు వ్యూహాలపై చర్చ జరుగగా, ముఖ్యంగా స్థానిక సమస్యల పరిష్కారం, ఎన్నికల నిర్వహణపై చర్చించారు.