సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ బీటీఆర్ కాలనీ, మారుతినగర్ కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేశారు. పెనుకొండ పట్టణ అధ్యక్షుడు శ్రీరాములు సచివాలయం అధికారులతో కలిసి పింఛన్లను లబ్ధిదారుల గృహాల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసినట్లు శ్రీరాములు తెలిపారు.