భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోట స్పేస్ సెంటర్లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో ఈ ప్రయోగం నిర్వహించింది. మూడు దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ SSLV పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది.