NDL: కల్లూరు అర్బన్ 31వ వార్డు బద్రీనాథ్ నగర్లో బుధవారం ఎమ్మెల్యే గౌరు చరితా ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇంటివద్దకే పింఛన్ అందడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.